హైదరాబాద్ లో ఫేక్ వీసాల కలకలం ...

SMTV Desk 2019-03-07 12:41:23  hyderabad, fake visa,

హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫేక్ వీసాలు కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుండి కువైట్ కు వెళ్తున్న 9మంది వీసాలు ఫేక్ అని నిర్ధారిత మయ్యాయి . వీరిని అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు ఎయిర్ పోర్ట్ పోలీసులు. వీరంతా కేరళ, తమిళనాడు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రలకు చెందిన వారుగా గుర్తించారు. డబ్బు సంపాధించేందుకు ఎక్కువగా కువైట్ వెళ్తుంటారు. ఏజెంట్ల మోసాలతో అమాయకులు మోసపోతున్నారని చెప్పారు పోలీసులు. 9 మంది మహిళల వెనక ఎవరైనా మగవారు ఉన్నారా..ఏజెంట్ ఏవరా అనే కోనంలో దర్యాప్తు చేపట్టామని, పూర్తి వివరాలు విచారణ తర్వాత తెలుపుతామన్నారు పోలీసులు