బూట్లతో దాడి చేసుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

SMTV Desk 2019-03-07 12:16:04  bjp mp mla fighting, uttarpradesh, Mehdawal Rakesh Singh Baghel , Sant Kabir Nagar Sharad Tripathi

లక్నో, మార్చ్ 06: ఉత్తరప్రదేశ్ లోని సంత్ కబీర్ నగర్ జిల్లా ప్రణాళిక సంఘం సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వారిద్దరూ ఒకరినొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో నెట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల ప్రకారం మేహ్‌దవల్ లో ఓ నూతన రహదారి నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకంపై తన పేరు లేదని ఎంపీ శరద్ త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ శరద్ త్రిపాఠి, మేహ్‌దవల్ ఎమ్మెల్యే రాకేశ్ బాఘెల్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దూషించుకుంటూ బూట్లతో దాడి చేసుకున్నారు. అక్కడున్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. గొడవ జరుగుతుండటంతో మంత్రి టాండన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆకడున్న వారందరూ ఈ నిర్వాహకాన్ని వీడియొ తీసి నెట్లో పెట్టారు. అది కాస్త వైరల్ గా మారింది.