అన్నా చెల్లెల ప్రేమ కథ...పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య

SMTV Desk 2019-03-07 12:10:26  brother and sister love affair, odisa, navarangapoor district

భువనేశ్వర్, మార్చ్ 06: ఒడిషా నవరంగపూర్‌ జిల్లాలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. వరుసకు అన్న చెల్లెళ్ళు అయ్యి ఉంది ప్రేమించుకున్నారు. కాని వారి ప్రేమను పెద్దలు అంగీకరించక పోగా పెళ్ళికి నిరాకరించారు. అప్పటికే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వారు....ఒకరిని వీడి మరొకరు ఉండలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాల ప్రకారం నవరంగపూర్‌ జిల్లాలోని ఖెమరా గ్రామానికి చెందిన జాని(21), కుమారి జాని(20) బంధువులు. వీరిద్దరు వరసకు అన్నాచెల్లెలు అవుతారు. అయితే దూరపు చుట్టాలు కావడంతో ఆ వరసల గురించి తెలియకపోవడంతో వీరిద్దరి మనసులు ఒక్కటయ్యాయి. ఒకరంటే మరొకరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇలా ప్రేమలో మునిగితేలిన వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించారు. దీంతో తమ ప్రేమ వ్యవహారం గురించి కుటుంబ పెద్దలకు తెలిపారు. అయితే వీరిద్దరి వరస కారణంగా పెళ్లికి నిరాకరించారు. దీంతో ఇద్దరూ కలిసి ఊరి చివరన వున్న ఓ చెట్టుకు ఉరెసుకుని ప్రాణాలు వదిలారు. ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్ధుల సాయంతో మృతదేహాలను కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.