జైషే సంస్థ మా దేశంలో లేదు..

SMTV Desk 2019-03-07 12:00:48  Jais , Pakistan,

ఇస్లామాబాద్, మార్చ్ 07: బాలాకోట్ వైమానిక దాడులపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది . ఆధారాలు చూపాలంటూ విపక్షాలు మరింత వాయిస్ పెంచాయి. దోమలను చంపి లెక్కబెడుతారా అంటూ ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి వీకే సింగ్. బాలాకోట్ లో 80 శాతం లక్ష్యాన్ని… చేధించాం అని ప్రకటించింది IAF. దాడులకు సంబంధించి రాడార్ చిత్రాలతో కూడిన నివేదికను కేంద్రానికి సమర్పించింది.

మరోవైపు జైషే మహ్మద్ సంస్థ పాక్ లో లేడని ప్రకటించారు ఆ దేశ ఆర్మీ ప్రతినిధి. రెండు రోజుల క్రితం పాక్ మంత్రి మసూద్ పాకిస్తాన్ లో ఉన్నాడని ప్రకటించగా.. ఆర్మీ ప్రతినిధి లేడని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. మసూద్ అజహర్ ను కాపాడే ఎత్తుగడలో భాగంగానే పాక్ ఆర్మీ ఈ ప్రకటన వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.