సెరీనా, వీనస్‌ల బయోపిక్‌ రాబోతుంది

SMTV Desk 2019-03-07 11:59:04  serina , vinus, biopic,

న్యూ ఢిల్లీ, మార్చ్ 07: సినీ రంగాల్లో బయోపిక్ హవా కొనసాగుతుంది ఈ నేపథ్యం లో ప్రపంచ టెన్నిస్‌ స్టార్స్ వీనస్‌ విలియమ్స్ ,సెరీనా విలియమ్స్‌ ల బయోపిక్‌ త్వరలోనే హాలీవుడ్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కథ పూర్తిగా సెరీనా, వీనస్‌ల తండ్రి కింగ్ రిచర్డ్‌ ప్రధాన పాత్రగా సాగుతుంది. ఈ ఇద్దరు నల్ల కలువల తండ్రి పాత్రకు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సెరీనా, వీనస్‌లకు నాలుగేల్ల వయస్సున్నప్పటి నుంచి వారిని అత్యుత్తమ టెన్నిస్‌ ప్లేయర్లుగా తీర్చిదిద్దాలని రిచర్డ్‌ భావించారు. అందుకోసం 78 పేజీలతో ఒక ప్రణాళికను సిద్దం చేసుకున్నారు. టెన్నిస్‌కు సంబంధించిన మెళకువలను ఒక్కో పాఠంగా చెబుతూ ఆ అక్కా చెల్లెళ్లను ప్రొఫెషనల్‌ ప్లేయర్లుగా తీర్చిదిద్దిడానికి ఎంతగానో శ్రమించారు. ఈ మూవీకి ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇంకా తెలియరాలేదు. స్టార్‌ త్రోవర్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ పతాకంపై టిమ్‌, ట్రీవర్‌లు నిర్మించనున్నారు. విల్‌ స్మిత్‌ కూడా నిర్మాణంలో భాగం కానున్నారు. ఇప్పటికే భారత సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్‌ నడుస్తోంది.