సంచలనం రేపుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' 'అవసరం' పాట

SMTV Desk 2019-03-07 11:54:26  Ram Gopal Varma,

హైదరాబాద్, మార్చ్ 07: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటల విడుదలతో వర్మ టాలీవుడ్ లో హైప్ పెంచేశారు. తాజాగా ‘అవసరం’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘ఆస్తులన్నీ పంచేవరకే తండ్రి అవసరం.. వరకట్నం ఇచ్చేవరకే మామ అవసరం’ అంటూ సాగే ఈ పాటపై నెటిజన్లు ఓ రేంజ్ లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.