5 కోట్లు పలికిన 'మజిలీ' శాటిలైట్ హక్కులు

SMTV Desk 2019-03-07 11:53:32  Majili ,

హైదరాబాద్, మార్చ్ 07: ప్రముఖ హీరో నాగచైతన్య .. అందాల తార సమంత జంటగా మజిలీ సినిమా నిర్మితమైంది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, దివ్యాంశ కౌశిక్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. కథానాయకుడి జీవితంలోని అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది. పెళ్లి తరువాత సమంత .. చైతూ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడం వలన, తెరపై కూడా వాళ్లు భార్యాభర్తలుగా కనిపించనున్న కారణంగా ఈ చిత్రం పై భారీ అంచనాలు వున్నాయి.

అందువలన సహజంగానే ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం టీవీ చానల్స్ పోటీపడ్డాయట. చివరికి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ వారు దక్కించుకున్నారు. ఇందుకుగాను వాళ్లు 5 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఇక డిజిటల్ హక్కులు .. హిందీ డబ్బింగ్ రైట్స్ అమెజాన్ కి మంచి రేటుకి ఇచ్చినట్టు తెలుస్తోంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.