భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కలకలం...

SMTV Desk 2019-03-07 11:51:27  Pakistan Citizen, Mid Night. Entered India, Arrested

గాంధీనగర్, మార్చి 7: భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఓ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద 30 ఏళ్ల వయసున్న పాక్ వ్యక్తిని భద్రత బలగాలు పట్టుకున్నారని ఓ అధికారి చెప్పారు. ఆ వ్యక్తి పేరు మనహార్‌ సోటా అనీ, సింధ్‌ ప్రావిన్సులోని ఉమర్‌కోట్‌ జిల్లా వాసి అని అధికారి తెలిపారు. అర్ధరాత్రి 2.40 గంటల సమయంలో అతను భారత్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించగా భద్రతా దళం పట్టుకున్నారని తెలిపారు. అతని వద్ద ఆయుధాలు తదితరాలేవీ దొరకలేదనీ, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని చెప్పారు. భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతనే లొంగిపోయాడని తెలిపారు. అయితే ఆ వ్యక్తి అలా అర్ధరాత్రి సమయంలో అదికూడా అక్రమంగా రావడం వెనుక అనుమానం వ్యక్తం చేస్తున్నారు.