పాకిస్తాన్ ను హెచ్చరించిన భారత్

SMTV Desk 2019-03-07 11:48:27  Indian Army, Pakistan Boarder, LOC, Attack

న్యూఢిల్లీ, మార్చి 7: జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడి తరువాత భారత్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వరుస దాడులతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలు భయ భ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా పాక్ అదనపు బలగాలను కూడా మొహరించుకుంది. ఈ విషయం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. నివాసయోగ్య ప్రాంతాలు లక్ష్యంగా దాడులకు దిగొద్దని హెచ్చరించింది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలతో పాకిస్తాన్‌ తన బలగాలు, ఆయుధ సంపత్తిని అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల నుండి నియంత్రణ రేఖ వైపు తరలిస్తోంది. ఈ మేరకు భారత్ స్పందిస్తూ, పాక్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన ఆ తరువాతి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఎల్‌వోసీ వెంట సామాన్య పౌరులు లక్ష్యంగా మోర్టార్‌ దాడులు చేయవద్దని మంగళవారం హాట్‌లైన్‌ ద్వారా జరిపిన సంభాషణలో భారత అధికారులు పాక్‌ను హెచ్చరించారు. ఎల్‌వోసీ, అంతర్జాతీయ సరిహద్దులో నిఘాను పటిష్టం చేశారు. పాకిస్తాన్‌ నుండి ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు ఎదురైనా దీటుగా తిప్పికొడతామని ఆర్మీ స్పష్టం చేసింది.