భారత్ కు అగ్రస్థానం

SMTV Desk 2019-03-07 11:29:59  Internet..

టెలికాం రంగంలో ‘జియో’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. జియో దెబ్బకి ఇతర నెటవర్క్ లు దాదాపు కుదేలు అయ్యాయి. అతి తక్కువ ధరకే 4జీ వేగంతో డేటాను అందించేందుకు రిలయన్స్‌ ‘ జియో’ సిమ్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. జియో తాకిడిని తట్టుకునేందుకు ఇతర నెట్ వర్క్స్ కూడా భారీ ఆఫర్లు ప్రకటిస్తూ వస్తున్నాయి.

భారత్ లో ఇంటర్ నెట్ డేటా విప్లవం గురించి చెప్పాల్సివస్తే జియోకి ముందు, జియో తర్వాత అని చెప్పాలి. రిలయన్స్ మానస పుత్రిక జియో రంగప్రవేశంతో అప్పటివరకు ఉన్న ఇంటర్నెట్ హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎంతో ఖరీదైనదిగా భావించే నెట్ డేటా అత్యంత చవకగా అందుబాటులోకి వచ్చింది. జియో రాకతోనే భారత్ లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. దాని ఫలితమే ప్రపంచంలోకెల్లా అత్యంత చవకగా డేటా లభించే దేశాల్లో భారత్ కు అగ్రస్థానం దక్కింది. భారత్ లో సగటున 1జీబీ డేటా రూ.18.5 కాగా, అంతర్జాతీయ విపణిలే అదే 1జీబీ డేటా సగటు ధర రూ.600 పలుకుతోంది.