వందరోజుల బాహుబలి..!

SMTV Desk 2017-08-06 11:33:52  raja mouli, bahubali, Prabhas, Anushka, Tamanna, Rana, Satya Raj, Ramaykrishna, bahubali 2

హైదరాబాద్, ఆగస్ట్ 6: రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, సత్య రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ‘బాహుబలి-2’ సినిమా నిన్నటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. కాగా ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు, పది రోజుల్లోనే రూ. వెయ్యి కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వ‌ర‌కు ఏ భారత సినిమా 50 రోజుల తర్వాత కూడా వెయ్యి సెంట‌ర్లలో ప్రదర్శించబడినది లేదు. కానీ బాహుబలి ఎన్ని సెంటర్స్‌లో వందరోజుల పూర్తి చేసుకుందనేది క్లారిటీ రాలేదు. ఇకపోతే ఈ చిత్రం త్వరలో చైనాలో కూడా రిలీజ్ కానుందట. విడుదలైన రోజు నుండే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపుగా 2000 కోట్ల కలెక్షన్లను సాధించి తెలుగువాడి సత్తాను ప్రపంచానికే చాటి చెప్పింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ స్పెషల్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది.