భారత జట్టు అరుదైన ఘనత

SMTV Desk 2019-03-07 11:28:55  India, Australia

నాగ్‌పూర్ వేదికగా మంగళవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 8 పరుగుల తేడాతో ఉత్కంఠ పోరాటం లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వన్డేల్లో టీమిండియాకు ఈ విజయం 500వది కావడం విశేషం. ఫలితంగా వన్డేల్లో 500 విజయాలను నమోదు చేసిన రెండో జట్టుగా భారత జట్టు అరుదైన ఘనత సాధించింది.

ఇకపోతే ఈ జాబితాలో 558 విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 479 విజయాలతో పాకిస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది. 1975 జూన్ 11న వెంకటరాఘవన్ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు తొలి వన్డే విజయాన్ని నమోదు చేసింది. 1975 వరల్డ్ కప్‌‌లో ఆడిన భారత్ పది వికెట్ల తేడాతో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించింది.

వన్డేల్లో పది వికెట్ల తేడాతో ఓ జట్టు గెలవడం అదే తొలిసారి. 1974 జూలై 13న భారత్ ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. అయితే, టీమిండియా సాధించిన 300వ, 400వ, 500వ వన్డే విజయాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భాగస్వామి కావడం విశేషం.