డేటా చోరీ : ఇదంతా జగన్ ఆడుతున్న నాటకం!

SMTV Desk 2019-03-06 18:52:51  datawar, it grid company ceo ashok, am minister nara lokesh, ysrcp, ys jagan mohan reddy

అమరావతి, మార్చ్ 06: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డేటాను చోరీ చేసింది జగనేనని, ఇదంతా జగన్ ఆడుతున్న ఓ నాటకమని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ లో లోకేష్ సాక్ష్యాలు పొందుపరిచారు. వైసీపీ పార్టీ నుంచి ప్రజలకు కొందరు వ్యక్తులు కాల్స్ చేస్తున్నారంటూ.. లోకేష్ అన్నారు. ఈ మేరకు రెండు ఆడియో క్లిప్స్ ని కూడా తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ‘హైద‌రాబాద్ వైకాపా కాల్ సెంట‌ర్ నుంచే APలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురిచేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా? ఇన్ని అక్ర‌మాలు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయి.’ అని లోకేష్ పేర్కొన్నారు.‘‘మరి దీని పై TS ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? జగన్, @ktrtrs జోడి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?’’ అంటూ మరో ట్వీట్ చేశారు.