వాట్సాప్‌లో మరో సరికొత్త ఫీచర్‌

SMTV Desk 2017-08-06 11:11:50  whats app, new feathers, background settings, emoji features

హైదరాబాద్, ఆగస్ట్ 6 : ఇటీవల వాట్సాప్‌కు సంబంధించిన అనేక కొత్త ఫీచర్లు బయటికొచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో ఇమేజ్‌ ఇన్‌ మోడ్‌, స్టిక్కర్లు పంపుకునే సౌలభ్యం, టెక్ట్స్‌ కు కొత్త ఎఫెక్ట్స్‌ జోడించడం వంటివి కొన్ని పరిశీలన దశలోనే ఉండగా త్వరలో మరికొన్ని ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా వాట్సాప్‌ లో మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సరికొత్త ఫీచర్లో పాస్‌బుక్‌ లో మాదిరిగా వాట్సాప్‌లోనూ రంగు రంగుల బ్యాగ్రౌండ్‌తో స్టేటస్‌ పెట్టుకోవచ్చు. అంతేకాక ఫాంట్‌ ఎమోజీలను ఉపయోగించడం, బ్యాగ్రౌండ్‌ మార్చుకోవడం వంటి ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.17.291లో ఈ ఫీచర్‌ను జోడించినట్లు తెలుస్తోంది. కాని ప్రస్తుతానికి ఈ ఫీచర్‌, ఎంపిక చేసిన కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.