2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల ప్రధానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు 7 అవార్డులు

SMTV Desk 2019-03-06 18:01:30  Swachh Survekshan 2019, telangana state, andhrapradesh state, president of india ramnath kovindh, indore

న్యూఢిల్లీ, మార్చ్ 06: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ బుదవారం 2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను విజ్ఞాన భవన్‌లో ప్రధానం చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు 7 అవార్డులు దక్కాయి. తెలంగాణలో సిద్ధిపేట, సిరిసిల్ల మరియు బోడుప్పల్‌ ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి ప్రాంతాలు అవార్డుల జాబితాలో ఎంపికయ్యాయి. ఇక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ మాత్రం దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా మూడో సారి నిలిచింది. కేంద్ర ప్రభుత్వం జనవరి 1 నుంచి 31 వరకు స్వచ్ఛ నగరాల జాబితా కోసం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాల్లో, నగరాల్లో ఈ సర్వే చేపట్టగా.. వాటన్నింటినీ దాటుకుంటూ ఇండోర్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల వివరాలు..

అత్యంత స్వచ్ఛ నగరం-ఇండోర్‌
అత్యంత స్వచ్ఛ రాజధాని-భోపాల్‌(మధ్యప్రదేశ్‌)
1-3 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం-న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పరేషన్‌
3-10 లక్షల జనాభా గల నగరాల్లో స్వచ్ఛ నగరం-ఉజ్జయిని
10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో స్వచ్ఛ నగరం-అహ్మదాబాద్‌(గుజరాత్‌
స్వచ్ఛత కోసం పాటు పడుతున్న టాప్‌ 3 రాష్ట్రాలు-ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర