డేటావార్ కేసు : సిఈఓ అశోక్‌పై లుక్‌ఔట్‌ నోటీసులు

SMTV Desk 2019-03-06 15:40:03  datawar, it grid company ceo ashok, cyberabad police

హైదరాబాద్‌, మార్చ్ 06: డేటావార్ కేసులో ఐటి గ్రిడ్స్‌ సిఈఓ అశోక్‌పై సైబరాబాద్‌ పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దేశంలోని పోలీసులను అలెర్ట్‌ చేశారు. అలాగే అశోక్ దేశం విడిచి పారిపోకుండా అతనిపై పోలీసులు ఎల్‌ఓసి జారీ చేశారు. ఐటి గ్రిడ్‌ కంపెనీ కేసులో అశోక్‌ను లొంగిపోవాలని పోలీసులు సూచించినా ఇంతవరకు ఆయన లొంగిపోలేదు. ఆయన కిచ్చిన సమయం కూడా నిన్నటితోనే ముగిసిపోయింది. ఆయన్ను సైబరాబాద్‌ పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే ఆయన రాష్ట్రం విడిచి పారిపోకుండా అన్ని ఎయిర్‌పోర్టులను అలెర్టు చేశారు.