ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్ష

SMTV Desk 2019-03-06 15:16:51  tdp mp rammohan nayudu, tdp mla ashok, srikakulam

శ్రీకాకుళం, మార్చ్ 06: టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ వద్ద చేపట్టిన దీక్ష ఈ రోజు ఉదయం 10 గంటలకు ముగిసింది. విశాఖ జోన్‌లో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై పోరుబాట పట్టిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు వాల్తేరు డివిజన్‌ను కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ నిన్న సాయంత్రం 6 గంటలకు దీక్ష ప్రారంభం చేశారు. ఈ దీక్షలో రామ్మోహన్‌ నాయుడుతో పాటు ఎమ్మెల్యే అశోక్ కూడా పాల్గొన్నారు.