‘చిన్నదేశం.. పెద్ద కలలు’...అంతరిక్షంలోకి ఇజ్రాయెల్‌ ఫస్ట్ స్పేస్‌క్రాఫ్ట్‌

SMTV Desk 2019-03-06 15:07:57  Israels first spacecraft to moon, Israel Aerospace Industries, space photo

మార్చ్ 06: అంతరిక్షంలోకి అత్యంత దూరం ప్రయాణం చేసిన దేశాల జాబితాలోకి తాజాగా చిన్న దేశం ఇజ్రాయెల్‌ కూడా వచ్చి చేరింది. ఈ మధ్యే చంద్రునిపైకి పంపిన తొలి ఇజ్రాయెల్ స్పేస్‌క్రాఫ్ట్‌ అంతరిక్షంలో భూమికి దాదాపు 37 వేల కిలోమీటర్లు దూరం వద్ద తన మొదటి సెల్ఫీని తీసి భూమికి పంపించింది.

ఈ సెల్ఫీలో భూమిపై ఆస్ట్రేలియా భూభాగం స్పష్టం కనిపిస్తోందని మిషన్‌ సభ్యులు ఆ ఫొటోను పోస్టు చేస్తూ తెలిపారు. ఈ ఫొటోలో స్పేస్‌క్రాఫ్ట్‌పై ఇజ్రాయెల్‌ జాతీయ పతాకంతోపాటు.. ‘చిన్నదేశం.. పెద్ద కలలు’ అని రాసున్న మెస్సేజ్ కూడా కనిపిస్తోంది.

ఇజ్రాయెల్‌కు చెందిన తొలి మూన్‌ లాండర్‌ను ఫ్లోరిడాలోని కేఫ్‌ కానవెరాల్‌ నుంచి రెండు వారాల క్రితం విజయవంతంగా ప్రయోగించారు. ఇది ఏప్రిల్‌ 11న చంద్రునిపై దిగనుంది. 585 కిలోల బరువున్న ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను స్పేస్‌ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా పంపించారు.

ఇప్పటివరకూ రష్యా, అమెరికా, చైనాకు చెందిన స్పేస్‌క్రాఫ్టులు 3,84,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చంద్రునిపై దిగాయి.