ఫ్లిప్‌కార్ట్‌ 'ఉమెన్స్ డే' ఆఫర్స్....

SMTV Desk 2019-03-06 14:53:56  world womens day, flipkart, special offers, big sales, smartphones

మార్చ్ 06: ఈ - కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెల 7,8 తేదీల్లో భారీ డిస్కౌంట్ సేల్ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హానర్‌ 9ఎన్, నోకియా 6.1 ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, వివో వి9 ప్రో, మోటో వన్‌ పవర్‌ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లు అందించనుంది. అంతేకాకుండా లాప్‌టాప్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది.

స్పెషల్ ఆఫర్స్ :

* హానర్ 9ఎన్‌....రూ.11,999, ఆఫర్ ప్రైస్ రూ. 9,999
* నోకియా 6.1 ప్లస్‌...రూ.15,499, ఆఫర్ ప్రైస్ రూ.13,999
* వివో వి9 ప్రో...రూ.13,990, రూ.2000 డిస్కౌంట్‌
* గూగుల్‌ పిక్సెల్‌ 3... రూ.71,000, ఆఫర్ ప్రైస్ రూ.59,999
* శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8... రూ.30,990
* జెన్‌ఫోన్ లైట్‌ ఎల్1...రూ.4,999

అంతేకాకుండా ఈ సేల్‌ జరుగుతున్న రెండు రోజులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి బ్లాక్‌బస్టర్‌ డీల్స్, ప్రతి గంటకొకసారి ఓమైగాడ్‌ డీల్స్‌ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.