పదవ తరగతి పరీక్ష వాయిదా....!

SMTV Desk 2019-03-05 18:40:46  board exams ssc, telangana state government, telangana loksabha elections, ssc english paper2 exam postponed

హైదరాబాద్, మార్చ్ 05: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పదవ తరగతి పరీక్షలను ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వాయిదా వేశారు. ఈ నెల 22 న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అదే రోజున పదవ తరగతి ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష జరగాల్సివుంది. దీనితో ఆ పరీక్షను వచ్చే నెల ఏప్రిల్ 3న ఇంగ్లీష్ సెకండ్ పేపర్ పరీక్ష ఉంటుందని పదవ తరగతి బోర్డు తెలిపింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున పరీక్ష వాయిదా వేయాలని ఎన్నికల సంఘం పదవ తరగతి బోర్డును కోరింది. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది.