ఈ దాడి మిలిటరీ చర్య కాదు : నిర్మలా సీతారామన్

SMTV Desk 2019-03-05 18:39:36   Defence Minister Nirmala Sitharaman, pulwama attack, indian army, indian airforce

న్యూఢిల్లీ, మార్చ్ 05: జమ్ముకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారత సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకగా భారత్ విమాన దళాలతో పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలలో దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఇప్పటికీ కేవలం వార్తలే వస్తున్నాయి కాని అధికారికంగా ఎవ్వరూ ప్రకటించలేదు. అయితే ఈ దాడిపై తొలిసారి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియతో మాట్లాడుతూ...మీకు చెప్పడానికి ఎలాంటి సంఖ్య నా దగ్గర లేదు అని అన్నారు. అసలు దాడులు జరిగాయా, జరిగితే ఆధారాలు ఇవ్వండి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ దాడి మిలిటరీ చర్య కాదని కూడా ఆమె చెప్పారు. ఇండియాపై దాడికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు ప్రణాళిక రచిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారం మేరకే ఈ దాడులు చేశాం. ఈ దాడులకు, ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆమె చెప్పారు.