ఆసిస్ కు 251 పరుగుల లక్ష్యాన్ని ముందుంచిన టీంఇండియా

SMTV Desk 2019-03-05 18:25:01  india vs australia 2nd odi, virat kohli, australia won the toss in 2nd odi, nagapur vidarbha stadium

నాగపూర్, మార్చ్ 5: ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్‌లోని విదర్భ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా 48.2 ఓవర్లలో 250 పరుగులు చేసి ఆసిస్ కు 251 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది. భారత్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ విరాట్ కోహ్లీ 116, విజయ్ శంకర్ 46, శిఖర్ ధావన్, రవీంద్ర జడేజాలు 21 చొప్పున చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు కమ్మిన్స్ 4, జంపా 2, నైల్, మ్యాక్స్ వెల్, నాథన్ లియాన్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 251 పరుగులు చేయాల్సి ఉంది.

టీమిండియా:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, కేదర్ జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, బుమ్రా

ఆస్ట్రేలియా:
ఖవాజా, ఫించ్, స్టోనిస్, హ్యాండ్స్‌కాంబ్, మ్యాక్స్‌వెల్, షాన్ మార్ష్, అలెక్స్ క్యారీ, కౌంటర్ నైల్, పాట్ కమిన్స్, ఆడం జంపా, లైన్