కర్నూలులో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్

SMTV Desk 2017-08-05 19:25:59  Rakul preeth at Big C mobiles showroom opening Karnool, Rakul preeth singh, Karnool Big C opening

కర్నూలు, ఆగష్ట్ 5: బిగ్ సి మొబైల్స్ సంస్థకు హీరోయిన్‌ రకుల్ ప్రీత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె శనివారం కర్నూలు నగరంలో సందడి చేశారు. నేడు ఆమె కర్నూలులో నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. రకుల్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పరిసరాలన్నీ జనంతో సందడిగా మారిపోయాయి. అభిమానులు ఆమెను ఫోన్లలో ఫొటోలు తీసేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా రకుల్‌ మాట్లాడుతూ.. కర్నూలుకు రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.