కాంగ్రెస్‌ పార్టీలో చేరిన పంజాబ్‌ ఎంపీ!

SMTV Desk 2019-03-05 15:33:17  Sher Singh Ghubaya, Rahul Gandhi, SAD, Congress, Party Changing

న్యూఢిల్లీ, మార్చి 5: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీలోకి మరో వ్యక్తి చేరారు. శిరోమణి అకాలీదళ్‌(ఎస్‌ఏడీ) పార్టీకి పంజాబ్‌ ఎంపీ షేర్‌ సింగ్‌ గుభయా రాజీనామా చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఫిరోజ్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించే గుభయా సోమవారం ఎస్‌ఏడీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుభయాను ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుండి బహిష్కరించినట్టు అకాలీదళ్‌ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో షేర్‌ సింగ్‌ గుభయా పార్టీ మారడం విశేషం.