'సర్వం తాళమయం' ట్రైలర్ విడుదల

SMTV Desk 2019-03-05 15:32:03  Sarvam Thalamayam, Trailer release, GV Prakash Kumar

హైదరాబాద్, మార్చి 05: తమిళంలో జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన సినిమాను తెలుగులో సర్వం తాళమయం పేరుతో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ట్రైలర్ ని విడుదల చేసారు. ఈ ట్రైలర్ ను బట్టి పేదరికంలో పుట్టిన ఒక యువకుడు, సంగీతం నేర్చుకోవడానికి పడిన కష్టాల నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలుస్తుంది. హీరోకి సంగీతం పట్లనున్న తపన, సంగీతం నేర్చుకోవాలనుకునే ఉద్దేశంతో చేసిన ప్రయత్నాల్లో ఎదురైన అవమానాలను ఈ ట్రైలర్లో చూపించారు. హీరో జీవీ ప్రకాశ్ కుమార్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్దమయ్యాడు. రాజీవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించాడు.