వన్డేలకు గుడ్ బై చెప్పిన సౌత్ఆఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్!

SMTV Desk 2019-03-05 15:26:37  south africa criketer tahir imran, odi, t20, tahir imran retirement in odi matches

దక్షిణాఫ్రికా, మార్చ్ 5: దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ త్వరలో జరగనున్న ఐసిసి ప్రపంచకప్ 2019 తర్వాత వన్డేల నుంచి వైదొలగుతున్నట్టు తాజాగా ప్రకటించాడు. దేశంలో రానున్న తరం స్పిన్నర్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇమ్రాన్ తెలిపాడు. ప్రపంచకప్ తర్వాత వన్డేల నుంచి మాత్రమే తప్పుకుంటున్నానని, టీ20 మ్యాచుల్లో ఆడుతానని తెలిపాడు. పాకిస్థాన్ జాతీయుడైన తాహిర్ 2011 ఫిబ్రవరి 24న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తరపున వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 95 వన్డేలు ఆడిన ఆయన 156 వికెట్లు తీశాడు. 146 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు రెండు వన్డే ప్రపంచకప్ లు, రెండు టీ20 ప్రపంచకప్ లో తాహిర్ ఆడాడు.