'రుద్రవీణ' సినిమా గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

SMTV Desk 2019-03-05 15:20:50  Rudraveena, Nagababu, Chiranjeevi

హైదరాబాద్, మార్చి 05: మెగా బ్రదర్ నాగబాబు నా ఛానల్ .. నా ఇష్టం ఛానల్ వీడియో ద్వారా చిరంజీవి నటించిన రుద్రవీణ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. "అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన మొదటి సినిమా రుద్రవీణ . అన్నయ్యతో ట్రావెల్ చేయాలనే కోరికతో .. అన్నయ్య సూచన మేరకు ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి అంగీకరించాను. శంకరాభరణం కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక సింధుభైరవి సినిమా కూడా నాకు బాగా నచ్చడంతో .. అలాంటి సినిమా తీయాలనిపించింది. దర్శకుడు బాలచందర్ గారితో మాట్లాడి రుద్రవీణ సినిమాను తీశాము. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. అప్పట్లో ఒక్క రోజులోనే ఇళయరాజా గారు అన్ని పాటలకు ట్యూన్స్ చేసేశారు. సినిమాకు 85 .. 90 లక్షల వరకూ బడ్జెట్ అయింది. సినిమా పరాజయంపాలు కావడంతో బాధపడ్డాము. ఆ సినిమా మంచి పేరు తెచ్చినా, ఇప్పుడు అలాంటి కథతో ఎవరైనా వచ్చినా సాహసం చేయలేము. పేరుకి నేను నిర్మాతనే అయినా .. డబ్బులు మాత్రం అన్నయ్యవి. ఈ సినిమాకి గాను ఆయన ఓ 10 .. 15లక్షలు నష్టపోయాడు" అని చెప్పారు.