'సూర్య వంశీ' ఫస్ట్ లుక్ రిలీజ్

SMTV Desk 2019-03-05 13:11:58  Surya Vanshi, Akshay Kumar, Rohit Shetty, Karan Johar, First look

ముంబై, మార్చి 05: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రతీసారి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఆయన నటించిన కేసరి చిత్రం ఇంకా విడుదల కాకముందే మరో సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఈ సినిమాకు బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సూర్య వంశీ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. తాజాగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుదల చేసారు. ఇందులో అక్ష‌య్ కుమార్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. సూర్య‌వంశీ చిత్రాన్ని రోహిత్ శెట్టి - క‌ర‌ణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.