త్రివిక్రమ్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-03-05 13:02:19  Trivikram, Pawan Kalyan

నెల్లూరు, మార్చి 05: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య అనుబంధం అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ అంటే పవన్ కు ఎనలేని అభిమానం. తాజాగా నెల్లూరులో వైద్య విద్యార్థులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గురించి కొని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. త్రివిక్రమ్ అంటే ఓ సినిమా దర్శకుడిగానే అందరికీ తెలుసని... ఆయన ఒక అత్యున్నత విద్యావంతుడని చెప్పారు. త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేశారని, యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ కూడా అని తెలిపారు. సినిమా అనేది ఒక గొప్ప రంగమని... 24 క్రాఫ్టులపై అవగాహన ఉంటేనే చిత్రాన్ని గొప్పగా తెరకెక్కించగలరని చెప్పారు. ఎంతో అనుభవం కూడా ఉండాలని చెప్పారు. డాక్టర్లు కూడా హౌస్ సర్జన్ చేసిన తర్వాతే విధుల్లోకి వస్తారని అలాగే, 2014 ఎన్నికల సమయం తనకు వైద్య విద్యార్థుల హౌస్ సర్జన్ షిప్ లాంటిదని... 2019 ఎన్నికల్లో తాను సర్జరీ చేయబోతున్నానని, శస్త్ర చికిత్స మొదలు పెడదామని వ్యాఖ్యానించారు. రోగి వ్యాధిని నయం చేసినట్టుగానే... సమాజాన్ని కూడా రుగ్మతల నుంచి కాపాడాల్సిన భాద్యత డాక్టర్లపై ఉందని పవన్ చెప్పారు.