'హీరో'గా రాబోతున్న విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-03-05 12:59:41  Vijay devarakonda, Dear Comrade, Hero

హైదరాబాద్, మార్చి 05: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నాడు. విజయ్‌ ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బైలింగ్వల్‌ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించబోతున్నాడని సమాచారం. అయితే ఈ సినిమా కోసం హీరో అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే హీరో అనే టైటిల్ టాలీవుడ్ కి ఇప్పటివరకు కలిసి రాలేదు. ఇప్పటికే చిరంజీవి, నితిన్‌లు ఈ టైటిల్‌తో సినిమాను తీసి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఒకవేళ విజయ్ సినిమాకి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తే ఇప్పుడు విజయ్ హీరో గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.