'అర్జున్ సురవరం' టీజర్ రిలీజ్...

SMTV Desk 2019-03-05 12:57:23  Arjun Suravaram, Nikhil, Lavanya Tripati , Teaser release

హైదరాబాద్, మార్చి 05: నిఖిల్ హీరోగా సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అర్జున్ సురవరం . మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా వుంది. ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ్ సినిమా కణితన్ కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ముందుగా ఈ సినిమాకి ముద్ర అనే టైటిల్‌ను పెట్టారు. ఆ తర్వాత దీన్ని అర్జున్ సురవరం గా మార్చారు. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. రాజ్ కుమార్, వేణు గోపాల్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు.