క్యూ ఆర్ కోడ్ తో పెళ్లి పత్రిక

SMTV Desk 2019-03-05 12:56:17  wedding invitations, barcodes, qr code

హైదరాబాద్, మార్చి 05: మారుతున్న కాలంతో ఎప్పటికప్పుడు అన్ని అప్ డేట్ అవుతున్నాయి. పెళ్లి ఆహ్వాన పత్రికల విషయానికొస్తే ఒక్కోకరిది ఒక్కో స్టైల్. ప్రచార, ప్రసార మాధ్యమాలలో విరివిగా వాడకంలో ఉన్న క్యూ ఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ ఇప్పుడు పెండ్లి పత్రికలపైనా చేరింది. నగరవ్యాప్తంగా ఇది ఇప్పుడిది కొత్త ట్రెండ్. సాధారణంగా వేడుకలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి వేదిక ఎక్కడన్నది త్వరగా తెలియదు. ఇందు కోసం తమను ఆహ్వానించిన వారికి ఫోన్ చేయటం లేదా దారిన పోయే వారిని అడగాల్సి రావటం మనందరికీ అనుభవమే. అయితే వేడుకల హడావుడిలో ఉన్న వారు ఇలా కాల్స్ రిసీవ్ చేసుకోవటం కొంత ఇబ్బందికరమే. ఇక దారిన పోయే వారు సరైన చిరునామా చెబుతారా అన్నది కూడా సందేహమే కదా! ఇప్పుడు ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడు తూ వేడుక వేదిక ఎక్కడో ఈ కోడ్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. అతిథులు తమ వద్ద ఉన్న ఆ హ్వాన పత్రికలోని క్యూ ఆర్ కోడ్‌ను తమ స్మార్ట్ ఫోన్‌లో స్కాన్ చేస్తే తాము ఉన్న ప్రాంతం నుంచి వేదిక వద్దకు చేరడానికి మార్గం, పట్టే సమ యం అంతా గూ గుల్ మ్యాప్‌లో చూపిస్తుంది. అంతేకాక దీనిలో వేడుక సందడి గురించి తెలియచేస్తూ రూపొందించిన వీడియో ప్రోమో సైతం ఈ కోడ్ స్కాన్ చేసు కున్న వారిని పలకరిస్తుంది. నేరుగా తమ వారు తమను ఆహ్వానిస్తూ వీడియోలో కనిపిస్తారు, ఆత్మీయతను పంచుతారు. సాధారణకార్డుతో పోలిస్తే క్యూఆర్ కోడ్‌ను జత చేసిన కార్డు కేవలం ఒక్క రూపాయి మాత్రమే అధిక మని నగరంలో ఈ తరహా కార్డును ముద్రించిన వారు పేర్కొంటున్నారు.