రాజ్ తరుణ్ ఖాతాలో క్రేజీ ఆఫర్

SMTV Desk 2019-03-05 12:47:50  Raj Tarun, Dill Raju, Lover

హైదరాబాద్, మార్చి 05: మొదటి సినిమా ఉయ్యాలా జంపాల తో హిట్ కొట్టిన రాజ్ తరుణ్ కి మళ్ళీ ఆ స్థాయిలో హిట్ పడలేదు. గత ఏడాది ఆయనకు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో అవకాశాలు కుడా తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో నటించే అవకాశం కొట్టేసాడు. ఇంతకుముందు దిల్ రాజు బ్యానర్ లో చేసిన లవర్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి దిల్, రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సినిమాకి నీది నాది ఒకటే లోకం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో రాజ్ తరుణ్ వున్నాడు.