మూడు విభిన్నమైన పాత్రలలో 'బిచ్చగాడు' ఫేం విజయ్ అంటోని

SMTV Desk 2019-03-05 12:39:40  Vijay Antony, Senthil Kumar

చెన్నై, మార్చి 05: బిచ్చగాడు సినిమాతో తెలుగులో అతి పెద్ద హిట్ అందుకున్న హీరో విజయ్ అంటోనీ. ఇటీవల కాలంలో ఈ హీరో గెలుపోటములతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా కాక్కి అనే చిత్రంలో నటిస్తున్నాడు. సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. లింగవేలన్‌, సుగదేవ్‌ నిర్మాణంలోని ఈ చిత్రంలో తెలుగు సీనియర్‌ నటి ఈశ్వరిరావు ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. చెన్నై ఏవీఎంలోని వినాయక ఆలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని భార్య ఫాతిమా కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ "ఇందులో మూడు భిన్నమైన పాత్రలలో విజయ్‌ ఆంటోని కనిపిస్తారు. అహ్మద్‌ సంగీతం సమకూర్చుతున్నారు. యాక్షన్‌, వినోదానికి ఏమాత్రం కొదవుండదు. రెండు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని" పేర్కొన్నారు. ఇందులో విజయ్‌ ఆంటోని సిక్స్‌ప్యాక్‌లో కనిపించనున్నాడు.