రియల్ మీ- 3 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు

SMTV Desk 2019-03-05 12:14:04  real me,

ప్రజల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు పెరిగిపోవడంతో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతోంది. ఈరోజు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో లభించనుంది.

గ్లోబల్ వెర్షన్, ఇండియా వెర్షన్లలో లభించనుంది. గ్లోబల్‌ వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో పీ60 ప్రాసెసర్, ఇండియా వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెసర్ ఉంటుందని సమాచారం. హీలియో పీ70, హీలియో పీ60 రెండూ కూడా ఆక్టాకోర్ ప్రాసెసర్లే. దీని ప్రారంభ ధర సుమారు రూ.8999 లు ఉండొచ్చు. రియల్‌మి 3 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో లభించనుంది. 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది. డ్యూయెల్ కెమెరాలు కూడా ఉన్నాయి. మార్చ్ 12 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో మొదటి సేల్ నిర్వహించనున్నారు.

రియల్‌మీ 3 ఫీచర్లు

డిస్‌ప్లే: 6.2 అంగుళాలు
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ70
రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4230 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై+కలర్ ఓఏస్ 6
కలర్స్: డైనమిక్ బ్లాక్, రేడియంట్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,999
4జీబీ+64జీబీ- రూ.10,999