వేములవాడకు భారిగా తరలి వచ్చిన భక్తులు...

SMTV Desk 2019-03-05 11:46:43  Vemulawada, Temple, Devotees, Rush, Indrakaran Reddy, Chandrasekhar Rao, TRS

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పుణ్య క్షేత్రల్లో వేములవాడ ఒకటి. నేడు మహా శివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయనికి భక్తులు భారిగా తరలి వచ్చారు. భక్తులకు అన్ని రకాల సహాయాలను అందించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై రాజన్న ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. చంద్రశేఖర్ రావును రెండోసారి ముఖ్యమంత్రి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తులు తిరిగి గెలవరనే తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. కానీ నేను ప్రభుత్వ పథకాలతోనే ఎన్నికల్లో గెలిచానని ఆయన అన్నారు. రాజన్న ఆలయానికి సీఎం కేసీఆర్ రూ.400 కోట్లు కేటాయించారని, త్వరలోనే ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఇంద్రకరణ్‌ స్పష్టం చేశారు.