మరదలి పై కామ కోరిక తీర్చుకున్న బావ

SMTV Desk 2019-03-05 11:45:35  marrige,.tiruvananthapuram

తిరువళ్లూరు, మార్చ్ 04: ఈ మధ్య కామ కుక్కలు ఎక్కువ అయిపోయారు వావి వరసలు లేకుండా అఘాయిత్యం చేస్తున్నారు .. అయితే ఓ ప్రబుద్దుడు అత్తింటివారికి తీరని వేదనను మిగిల్చాడు. సొంత మరదలిని కిడ్నాప్ చేసి ఓ షాపులో బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరికి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు మైనర్ బాలికను కాపాడారు. తమిళనాడులోని తిరువళ్లూరులో గత నెల చోటుచేసుకున్న ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లాలోని తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌ (22) ఇక్కడే స్థానికంగా ఓ సెల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో గత నెల 15న పెళ్లి జరిగింది. ఈ క్రమంలో సొంత మరదలి(13)పై అజిత్ కన్నేశాడు. అయితే ఫిబ్రవరి 27న ఆ బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో కేసు నమోదుచేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. మరోవైపు యువతిని కిడ్నాప్ చేసిన అజిత్ కుమార్ ఓ షాపులో ఆమెను బంధించి పలుమార్లు తన కామవాంఛను తీర్చుకున్నాడు. అయితే పోలీసుల విచారణలో బాలికను చివరిసారిగా అజిత్ తోనే చూశామని సాక్షులు చెప్పడంతో అధికారులు గత శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.