మాండ్యా సీట్ ముఖ్యమంత్రి కుమారుడికే!

SMTV Desk 2019-03-05 11:40:07  Kumaraswamy, Nikhil, Sumalatha, Devegowda, Hasan, Mandya, MP, RJD, Congress

బెంగళూరు, మార్చి 4: కర్నాటకలోని మాండ్యా లోక్ సభ సీటు కు ఇద్దరు పోటి పడ్డారు. సినీనటి సుమలత, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఈ నియోజకవర్గం సీటుపై పోటి పడగా, ఇప్పుడు దీనిపై స్పష్టత వచ్చేసింది. ఈ టికెట్‌లపై సంకీర్ణ పార్టీల మధ్య స్పష్టత రాకపోయినా మాండ్యా నుండి కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్‌ పోటీ చేయడం ఖరారైంది. ఇప్పటివరకు ఈ నియగాకవర్గం నుండి సుమలత పోటి చేస్తారన్న వార్తలు వచ్చాయి. ఈ సీటు కోసం మొదటి నుండి నిఖిల్ ప్రయత్నించినప్పటికీ, సుమలతకే దక్కుతుందని అనుకున్నారు.

సీఎం మైసూరు పర్యటనలో ఉండగా మంగళూరులో జేడీఎస్‌ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల స్పష్టత వచ్చిన తరువాత నిఖిల్‌ మాండ్యాలో కార్యకర్తలతో కలసి సంబరం చేసుకున్నారు. పెద్దల ఆశీర్వాదంతో మాండ్యాలో సేవలకు సిద్ధమవుతానని ప్రకటించారు. మాండ్యా నుండి నిఖిల్‌, హాసన్‌ నుండి ప్రజ్వల్‌లు పోటీ చేయడం ఖరారు చేశారు. ఇటివలే, సుమలత మాండ్యా నుండి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే, జేడీఎస్, కాంగ్రెస్ పొత్తులో ఉన్న నేపథ్యంలో సుమలత రాజకీయ ప్రవేశం కష్టంగానే ఉంది.