బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ వీళ్లేనా..!

SMTV Desk 2019-03-05 11:38:58  Bigg Boss,

స్టార్ మా ప్రెస్టిజియస్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఎన్.టి.ఆర్ ను బుల్లితెర మీదకు తెచ్చి హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అయ్యేలా చేసింది. ఇక సెకండ్ సీజన్ నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేశాడు. త్వరలో బిగ్ బాస్ సీజన్ 3 మొదలు కాబోతుందట. జూన్ నుండి బిగ్ బాస్ సీజన్ 3 వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో కంటెస్టంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఎన్.టి.ఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టంట్స్ గా కొంతమంది సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో యాంకర్ ఉదయభాను, మంజూషా, నటుడు దర్శకుడు జెడి చక్రవర్తి, హీరో వరుణ్ సందేష్, హీరోయిన్ పూజిత పొన్నాడ ఈ ఐదుగురు బిగ్ బాస్ 3కి సెలెక్ట్ అయ్యారట. గత రెండు సీజన్లతో పోల్చితే ఈసారి సెలబ్రిటీస్ విషయంలో రాజీ పడట్లేదని తెలుస్తుంది. ఎవరో తెలియని వారిని తెచ్చి వారికి ఇమేజ్ తెప్పించడం కన్నా ఆల్రెడీ ఫేమ్ ఉన్న వారిని తెచ్చి షో నడిపించాలని చూస్తున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 3 ఎలా ఉంటుందో చూడాలి.