మెగాస్టార్ టైటిల్ వాడేసుకుంటున్న కార్తీ

SMTV Desk 2019-03-05 11:37:59  khaidi, Kaarthi

న్యూఢిల్లీ, మార్చి 4: పాత సూపర్ హిట్ సినిమాల టైటిల్స్ ను వాడుకోవటం ఈ మధ్య కాలంలో ఎక్కువవుతోంది, ఇటీవల విక్రమ్ కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రానికి మెగాస్టార్ “గ్యాంగ్ లీడర్” టైటిల్ ను కన్ఫామ్ చేశారు. తాజాగా తమిళ హీరో కార్తీ కూడా మెగస్టార్ బ్లాక్ బస్టర్ టైటిల్ ను వాడుకుంటున్నారని వార్తలొస్తున్నాయి, మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఖైదీ సినిమా టైటిల్ ను కార్తీ తర్వాతి సినిమాకు వాడుకోవాలని అనుకుంటున్నారట.

లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా మార్చ్ లో మొదలు కానుంది, ఈ సినిమాకు ఖైదీ టైటిల్ ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్. కార్తీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో మెగాస్టార్ సూపర్ హిట్ టైటిల్స్ ను వాడుకుంటున్న నాని, కార్తీలకు ఏ మేరకు హిట్స్ లభిస్తాయో చూడాలి.