ఏ క్షణాన ఏం జరుగుతుందో అని......

SMTV Desk 2019-03-04 19:54:44  Narendra Modi, Rajnath Singh, Arun Jaitley, Sushma Swaraj, Nirmala Seetharaman,Ajith Doval, Vijay Gokhale, NSC, Meeting

న్యూఢిల్లీ, మార్చి 4: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి తరువాత ప్రతీకగా భారత వాయుసేన పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఈ రెండు దేశాల మధ్య దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఏ క్షణాన పాక్ దాడి చేస్తుందో అని భయ భ్రాంతులకు గురవుతున్నారు సరిహద్దు ప్రాంత ప్రజలు.

ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటిలో దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ధోవల్ ప్రధాని మోదీకి వివరించారు.