శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, కేసీఆర్‌, జగన్

SMTV Desk 2019-03-04 19:13:44  Narasimhan, Chandrasekhar Rao, Jaganmohan Reddy, Shiva Ratri Wishes

హైదరాబాద్, మార్చి 4: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ తెలుగు ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మహాశివరాత్రి పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వేర్వేరుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో తులతూగేలా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను దీవించాలని శివుడిని వేడుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. 11 మాస శివరాత్రుల్లో ఎంతో ఔన్నత్యం కలిగిన మహాశివరాత్రిని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో, పరమ పవిత్రంగా జరుపుకుంటారని పేర్కొన్న జగన్, ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభం జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.