అభిమానుల వల్ల ఇబ్బంది పడ్డ బన్ని

SMTV Desk 2017-08-05 15:00:29  allu arjun hampy toor

హైదరాబాద్, ఆగస్ట్ 5 : సెలబ్రిటీలకు ఉండే స్టేటసే వేరు. కనీసం వారు తమ కుటుంబాలతో స్వేచ్ఛగా బయట తిరగాలన్నా కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ కి ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. తన కుటుంబంతో కలిసి బన్ని హంపీ వెళ్ళారు. అక్కడ ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో విరూపాక్షేశ్వరుడిని దర్శించుకున్న అనంతరం కమల్ మహల్, రాతిరథం, విజయ విఠల ఆలయాలను సందర్శించుకున్నారు. కాని వీరు సందర్శనకు వెళ్ళిన ప్రతి చోట అభిమానులు భారీ ఎత్తున గుమిగూడి ఫోటోలు దిగేందుకు ఎగపడ్డారు. దీంతో అల్లు అర్జున్ చాలా ఇబ్బంది పడి సందర్శనను మధ్యలోనే రద్దు చేసుకుని అక్కడి నుంచి హోటల్ కు వచ్చేశారు. కాగా బన్ని కుటుంబ సభ్యులు నేడు మరికొన్ని స్మారక స్థలాలను చూసేందుకు ఏర్పాట్లు చేశామని హంపి పోలీసులు తెలిపారు.