పాపులర్ అవుతున్న అభినందన్… మీసకట్టు

SMTV Desk 2019-03-04 18:22:39  Abhinandan..

అభినందన్ వర్దమాన్ …. ది రియల్ ఇండియన్ హీరో. ప్రముఖ హీరోలే సలాం అంటూ ఫిదా అయిన ధీరత్వం అతనిది. శత్రు దేశంలో కూడా… ఎలాంటి జంకు లేకుండా కూల్ గా కప్ కాఫీ తాగుతూ… డోంట్ వర్రీ గాయ్స్ … ఐ యామ్ సేఫ్ అంటూ చెప్పిన ధైర్యవంతుడు అభినందన్. మేము ఎవరి జోలికి వెళ్లం… మా జోలికి వస్తే మాత్రం … ఇండియా పవర్ ఇలా ఉంటుందంటూ… శతృవులను తరిమి కొడుతూ పాకిస్థాన్ గడ్డపై కాలు మోపిన…. పాక్ సైన్యానికి పట్టుబడ్డ అంతే ధీరత్వం తో కనిపించాడు. భయం తన మీసాన్నీ కూడా టచ్ చేయలేక పోయింది. అది… అభినందన్ పవర్. దీంతో రియల్ హీరో అభినందన్… మీసకట్టు తెగ పాపులర్ అయిపోయింది. యువత ఆ మీసకట్టూ కోసం ట్రై చేస్తోంది. అభినందన్ లా కనబడాలని కోరుకుంటుంది. దీంతో సెలున్ల లో మీసం స్టైల్ కోసం డిమాండ్ పెరిగింది. మాకు అభినందన్ స్టైల్ మీసం కావాలంటూ యువత పరుగులు పెడుతున్నారు.