నువ్వేం చేస్తున్నావో తెలుసుకో! అఖిలప్రియపై రోజా ఫైర్..

SMTV Desk 2017-08-05 14:19:14  Rojaa fires on Bhuma Akhila priya reddy

నంద్యాల, ఆగస్ట్ 5 : నంద్యాల ఉపఎన్నికల సందర్భంగా ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ నేత రోజా, పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియపై మండిపడ్డారు. ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా మాట్లాడుతూ... శోభానాగిరెడ్డి చివరి రక్తపు బొట్టు వరకు చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. తండ్రి భూమా నాగిరెడ్డి మరణానికి కారణం ఎవరో తెలుసుకోవాలని అఖిల ప్రియకు రోజా సూచించారు. అసలు జగన్ నైతికతను ప్రశ్నించే ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలంటూ ప్రశ్నించారు. తండ్రి చితి ఆరక ముందే మంత్రి పదవి కోసం సంప్రదాయాలన్నింటినీ మర్చిపోయిన నువ్వా మాట్లాడేది? తల్లిదండ్రుల పేర్లు చెప్పి సానుభూతితో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నావని, ఏ పార్టీ నుంచి వచ్చి ఇప్పుడే పార్టీలో ఉన్నావో గుర్తుంచుకో అంటూ తీవ్ర స్థాయిలో వివర్శించారు.