విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

SMTV Desk 2019-03-04 17:18:33  Virat Kohli,

ఇండియన్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరగరాసాడు … ఈ సారి మరో రికార్డ్ కొల్లగొట్టారు. తాజాగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించి బోని కొట్టింది.మహేంద్ర సింగ్ ధోనీ…కేదార్ జాదవ్ రాణించడంతో విజయం సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే ఎన్నో రికార్డ్ లను బ్రేక్ చేసిన కోహ్లీ… మ్యాచ్ విజయంతో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. వన్ డే మ్యాచ్ లలో ఎక్కువ విజయాలు సాధించిన క్యాప్టేన్ గా విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్ రికార్డ్ ను బ్రేక్ చేస్తూ…అతన్ని వెన్నక్కి నెట్టేసాడు. విరాట్ సారధ్యంలో టీం ఇండియా 64 వన్డేలు ఆడగా…48 విజయాలు సాధించింది. దీంతో 47 మ్యాచ్ లు విజయం సాధించి మూడవ ప్లేస్ లో ఉన్న వివ్ రిచర్డ్ ను వెనక్కి నెట్టి 3 వ స్థానంలోకి వచ్చాడు.కోహ్లీ కంటే ముందు 51 మ్యాచ్ లలో రిక్కి పాంటింగ్ ఆస్ట్రేలియా… మొదటి స్థానంలో 50 మ్యాచ్ లతో క్లైవ్ లాయిడ్ విండీస్ 2 వ స్థానంలో ఉన్నారు. కాగా కోహ్లీ మొదటి స్థానానికి ఇంకా మూడు విజయాలు మాత్రమే అవసరం ఉన్నాయి.కాగా వన్డే ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారతీయ సారథిగా కూడా రికార్డ్ సాధించాడు కోహ్లీ.