లేడీ సూపర్‌ స్టార్‌ తో విజయ్ దేవరకొండ

SMTV Desk 2019-03-04 16:30:32  Nayan, Vijay

హైదరాబాద్, మార్చ్ 03: ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ , ఆశించిన ఫలితం సాధించలేకపోయాడు. తాజాగా తమిళ్ లో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. ప్రముఖ నిర్మాత ఎస్‌ఆర్‌ ప్రభు, కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటించనుందన్న వార్త కోలీవుడ్ వర్గాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. తెలుగు లో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ తమిళ్ లో కూడా తన సత్తా చూపించుకునేందుకు రెడీ అయ్యాడు. త్వరలోనే ఈచిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడునుంది.