రంగస్థలం ఖాతాలో మరో రికార్డు.

SMTV Desk 2019-03-04 16:29:17  rangasthalm.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. పీరియాడిక్‌ డ్రామా గా వచ్చిన ఈ చిత్రం తెలుగునాట నాన్‌ బాహుబలి రికార్డులన్నింటిని బ్రేక్ చేసి చరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఇతర దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.కన్నడ సినీ పరిశ్రమ చాలా ఏళ్ల నుండి ఇతర భాషల సినిమాలని తమ భాషలోకి డబ్ కానిచ్చేవి కావు. ఏ సినిమా అయినా సరే దాని ఒరిజినల్ భాషలో రిలీజ్ కావాల్సిందే. లోకల్ సినిమాలకి నష్టం వాటిల్లుతుందని భావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు కన్నడ సినీ పరిశ్రమ వారు.

కానీ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది రామ్ చరణ్ రంగస్థలం . ఈ సినిమా తమిళ, మలయాళ భాషలతో పాటు కన్నడలోకి కూడా అనువాదం కానుంది. కన్నడ చిత్రం కేజిఎఫ్ ను ఇతర భాషలు ప్రేక్షకులు విశేషంగా ఆదరించడంతో ఈ అనువాదం వీలవుతోంది. సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో దశాబ్దాల తరువాత కన్నడలో డబ్‌ అవుతున్న తెలుగు సినిమా గా రంగస్థలం రికార్డ్ సృష్టించనుంది. మరి తెలుగునాట భారీ సక్సెస్ అందుకున్న ఈ మూవీ కన్నడ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.