ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా అనిల్ కుంబ్లే

SMTV Desk 2019-03-04 16:27:58  anil khumble, former team india captain, icc chairmen

దుబాయ్, మార్చ్ 3: టీం ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా కుంబ్లేను పునర్నియమిస్తూ తాజాగా ఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కుంబ్లే ఈ పదివిలో మూడేళ్ళపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు దుబాయ్ లో ఆరు రోజుల పాటు ఏర్పాటైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2012లో తొలిసారిగా ఆయన ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌ నుంచి బాధ్యతలను తీసుకున్నారు. భారత్ తరఫున 18 సంవత్సరాల పాటు కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. అలాగే 271 వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రెండో ఆటగాడు కుంబ్లేనే కావడం విశేషం.