జగన్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు...!

SMTV Desk 2019-03-04 16:20:35  minister devineni uma, tdp, ys jagan mohan reddy, ysrcp, chandrababu

అమరావతి, మార్చ్ 3: ఆదివారం మీడియాతో సమావేశమయ్యారు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమ. ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ మోహన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి రాని ప్రతిపక్ష నేత జగన్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. జగన్‌ మార్నింగ్‌ వాక్‌లు, ఈవినింగ్‌ వాక్‌లలో మాట్లాడేటివన్నీ అసత్యాలేనన్నారు. జగన్ అమరావతిలో అవినీతి జరిగిందని అబద్దాలు చెబుతున్నారన్నారు. బోగస్‌ ఓటర్ల పేరుతో, చనిపోయిన వ్యక్తుల పేర్లతో కేసులు వేస్తున్నారని విమర్శించారు. ఇడుపులపాయకు రాజధాని తరలింపునకు జగన్‌ కుట్ర చేస్తున్నారని... బీజేపీ, కేసీఆర్‌, ఓవైసీతో జగన్‌ కుమ్మక్కయ్యారని విమర్శించారు. ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చిన జగన్‌ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడరన్నారు. కేసీఆర్‌తో కుమ్మక్కై వెయ్యి కోట్ల గిఫ్ట్‌కు జగన్‌ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.